wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

వృక్ష కణజాలం

Total questions: 20

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ఈ క్రింది వాటిలో వృక్ష కణజాలం ని గుర్తించండి

a)

విభాజ్య కణజాలం, ప్రసరణ కణజాలం, సంయోజక కణజాలం

b)

సంయోజక కణజాలం, ఆస్తి కణజాలం, స్తంభ కార కణజాలాలు

c)

త్వచ జాలం, ప్రసరణ కణజాలం ,సంధాయక కణజాల

d)

విభాజ్య కణజాలం, ప్రసరణ కణజాలం, ఉపకళా కణజాలం.

2.

జతపరచండి.

1. విభాజ్యా కణజాలం. A. పదార్థాల రవాణా పాల్గొంటాయి

2. సంధాయక కణజాల. B. ఆహారాన్ని నిల్వ చేయడానికి, యాంత్రికంగా ఉపయోగపడతాయి.

3. ప్రసరణ కణజాలం. C. వీటినుంచి మూల కేశాలు ఏర్పడతాయి.

4. త్వచ కణజాలం. D. మొక్కలు పెరుగుదలను కలిగిస్థాయి

a)

1. D, 2. C, 3. B, 4. A

b)

1. A, 2. D, 3. C, 4. B

c)

1. D, 2. B, 3.A, 4. C

d)

1. D, 2. B, 3. C, 4. A

3.

1. మొక్క దేహ ఉపరితలం అంతా కనిపించే కణజాలం - విభాజ్య కణజాలం.

2. పరాన్న జీవులు, రోగకారక జీవులు దాడి మొదలైన వాటినుండి మొక్కలను రక్షించేది - త్వచ కణజాలం

a)

1 and 2 సరైనవి

b)

1and 2 సరికానిది

c)

1 మాత్రమే సరైనది

d)

2 మాత్రమే సరైనది

4.

విభాజ్య కణజాలం - విభజన :: త్వచ కణజాలం -

a)

ఆహార పదార్థాల నిల్వ

b)

జిగురు స్రవించ బడుతుంది

c)

పదార్థాల రవాణా కి ఉపయోగపడుతుంది

d)

మొక్కకు యాంత్రిక శక్తిని ఇస్తుంది

5.

జతపరచండి

1. కణజాలం. A. ఒకే నిర్మాణాన్ని కలిగి ఒకే విధమైన విధులు నిర్వహిస్తాయి.

2. మధ్యస్థ విభాజ్య కణజాలం. B. నీటి రవాణాకు ఉపయోగపడతాయి.

3. దారు కణజాలం. C.కాండం మీద శాఖలు ఏర్పడే చోట, ఆకులు, పుష్పాలు పెరిగే చోట ఉంటాయి.

4. సంధాయక కణజాల. D. వీటిలో కొన్ని కణాలు కిరణజన్యసంయోగక్రియ ను జరుగుతాయి.

a)

1. A, 2. C, 3. D, 4. B.

b)

1. A, 2. C, 3. B, 4. D

c)

1. D, 2. C, 3. B, 4. A

d)

1. A, 2. B, 3. C, 4. D

6.

ఈ కణజాలం ని గుర్తించండి

a)

మృదు కణజాల

b)

హరిత కణజాలం

c)

దృఢ కణజాలం

d)

స్థూల కోన కణజాలం

7.

ఎరుపురంగు కణజాలాన్ని గుర్తించండి

a)

పోషక కణజాలం

b)

దారు కణజాలం

c)

మృదుకణజాలం

d)

దృఢ కణజాలం

8.

నీరు ఆహారం వ్యర్ధ పదార్థాలను నిల్వ చేసే కణజాలం

a)

హరిత కణజాలం

b)

వాత యుత కణజాలం

c)

నిల్వచేసే కణజాలం

d)

దృఢ కణజాలం

9.

సరికాని వాక్యాన్ని గుర్తించండి

1. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా దగ్గరగా అమరి ఉంటాయి. - విభాజ్య కణజాలం.

2. ఎడారి మొక్క లలో ఈ కణజాలం బాగా దళసరిగా ఉండి మైనపు పూత ను కలిగి ఉంటుంది.- సందాయక కణజాలం.

a)

1 and 2 సరైనవి

b)

1 and 2 సరికానివి

c)

1 మాత్రమే సరైనవి

d)

2 మాత్రమే సరైనది

10.

గీత గీయబడిన కణజాలం

a)

మృదుకణజాలం

b)

పార్శ్వ విభాజ్య కణజాలం

c)

మధ్యస్థ విభాజ్య కణజాలం

d)

అగ్ర విభాజక కణజాలం

11.

జతపరచండి

1. పదార్థాల రవాణాకు సహాయపడేది. A. ప్రసరణ కణజాలం.

2. వృక్ష దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలు సరైన స్థితిలో ఉండేలా చేసేవి. B. సంధాయక కణజాల.

3. మొక్క భాగాల అన్నింటి లో పెరుగుదలను, మరమ్మతులు నిర్వహించేవి. C. విభాజ్యా కణజాలాలు

4. పై పొరలను ఏర్పరచే వి. D. త్వచ కణజాలం

a)

1. D, 2. C, 3. B, 4. A

b)

1. A, 2. B, 3. C, 4. D

c)

1. A, 2. C, 3. D, 4. B

d)

1. D, 2. D, 3. A, 4. C

12.

సరికాని వాటిని గుర్తించండి.

1. త్వచ కణజాలం - పత్రరంధ్రాలు.

2. అన్నీ కణజాలాలు విభాజ్య కణజాలం నుంచి అభివృద్ధి చెందుతాయి.

3. పెద్ద చెట్లలో బాహ్యచర్మం పై అనేక పొరలు ను ఏర్పరుస్తుంది - త్వచ కణజాలం.

4. పోషక కణజాలం లో పొడవైన దారునాళాలు ఉంటాయి.

a)

1 మరియు 2 మాత్రమే

b)

2 మరియు 4 మాత్రమే

c)

3 మాత్రమే

d)

4 మాత్రమే

13.

చాలనీ కణాలు, చాలానీ నాళాలు, సహ కణాలను కలిగి ఉండే కణజాలం.

a)

సంధాయక కణజాల

b)

ప్రసరణ కణజాలం

c)

విభాజ్య కణజాలం

d)

త్వాచ కణజాలం

14.

కాండం కొన భాగాలలో ఉండి మొక్కల్లో పెరుగుదల కలిగించే కణజాలం.

a)

పార్శ్వ విభాజ్య కణజాలం

b)

మధ్యస్థ విభాజ్య కణజాలం

c)

అగ్ర విభాజ్య కణజాలం

d)

మూల విభాజ్య కణజాలం

15.

ప్రక్కన ఉన్న కణజాలం ఏ కణజాలానికి చెందినది.

a)

దృఢ కణజాలం

b)

మృదుకణజాలం

c)

స్తూల కోన కణజాలం

d)

ప్రసరణ కణజాలం

16.

మొక్కల లో ఏ భాగానికి "గ్రూ" మృదుకణజాలం అని పేరు పెట్టాడు.

a)

దారువు

b)

పోషక కణజాలం

c)

నాళికా పుంజం

d)

దవ్వ

17.

త్వచ కణజాలంలోని కణాల -------- ను బట్టి ఈ కణజాలం మూడు రకాలుగా విభజింపబడింది.

a)

విధుల్ని బట్టి

b)

స్థానాన్ని బట్టి

c)

విధుల్ని మరియు స్థానాన్ని బట్టి

d)

ఆకారము మరియు స్థానాన్ని బట్టి

18.

బాహ్య చర్మంపై బెరడును ఏర్పరిచే కణజాలం

a)

ప్రసరణ కణజాలం

b)

సంధాయక కణజాల

c)

త్వచ కణజాలం

d)

విభాజ్య కణజాలం

19.

సంధాయక కణజాల - మొక్కకి ఆధారాన్ని ఇస్తుంది :: త్వచ కణజాలం -

a)

పదార్థాల రవాణా

b)

మొక్క దేహాన్ని కప్పి ఉంచుతుంది

c)

మొక్కల పెరుగుదలకు

d)

మొక్కలలో శ్వాసక్రియ కి

20.

పక్క పటాన్ని గమనించడి. ఈ పటం దేనికి సంబంధించింది

a)

ద్విదల బీజ వేరు అడ్డుకోత

b)

ద్విదళ బీజ కాండం అడ్డుకోత

c)

ఏకదళబీజ వేరు అడ్డుకోత

d)

ఏకదళబీజ కాండం అడ్డుకోత