Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10 మానవ విసర్జక వ్యవస్థ page 81,82, 86, 87

Total questions: 28

Worksheet time: 15mins

Name
Class
Date
1.

24 గంటల మూత్ర పరీక్ష అనగా

a)

24 గంటలలో సేకరించిన మొత్తం మూత్రంలో నుండి 100 - 150 మి.లీ. మూత్రం నమూనాగా తీసుకుని దానిని పరీక్ష చేస్తారు

b)

100 - 150 మి.లీ. మూత్రాన్ని 24 గంటలసేపు పరీక్ష చేస్తారు

c)

ప్రతీ 24 గంటల కొకసారి 100 - 150 మి.లీ. మూత్రాన్ని సేకరించి దానిని పరీక్ష చేస్తారు

d)

మొదట 100 - 150 మి.లీ. ల మూత్రాన్ని సేకరించి దానిని 24 గంటలు గడిచాక పరీక్ష చేస్తారు

2.

మానవుని మూత్ర విసర్జన వ్యవస్థలోని భాగాలు

( 4 సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

ఒక జత మూత్ర పిండాలు

b)

ఒక జత మూత్ర నాళాలు

c)

మూత్రాశయం

d)

ప్రసేకం

e)

ఒక జత శుక్ర నాళాలు

3.

మానవుని మూత్ర పిండాల ఆకారం

a)

చిక్కుడు గింజ

b)

బఠాణీ గింజ

c)

గోధుమ గింజ

d)

వడ్ల గింజ

4.

మూత్రపిండాల రంగు ( బయటవైపు)

a)

ముదురు గోధుమ

b)

ముదురు ఎరుపు

c)

లేత పసుపు

d)

లేత గులాబీ

5.

మానవ శరీరంలో మూత్రపిండాల స్థానం

a)

ఉదరకుహరంలో

b)

ఉరఃకుహరంలో

c)

ద్రోణి ( కటివలయ) భాగంలో

d)

పృష్ఠకుహరంలో

6.

సరైన వాక్యం గుర్తించండి

a)

కుడివైపు మూత్ర పిండం, ఎడమవైపు దానికన్నా కొద్దిగా కిందికి ఉంటుంది

b)

ఎడమవైపు మూత్ర పిండం, కుడివైపు దానికన్నా కొద్దిగా కిందికి ఉంటుంది

c)

రెండు మూత్ర పిండాలు సమానంగా ఉంటాయి

7.

మూత్రపిండాల పొడవు

a)

10 సెం.మీ.

b)

4 సెం.మీ.

c)

12 సెం.మీ.

d)

20 సెం.మీ.

8.

మూత్రపిండాల వెడల్పు

a)

10 సెం.మీ.

b)

5 - 6 సెం.మీ.

c)

4 - 5 సెం.మీ.

d)

6 - 7 సెం.మీ.

9.

మూత్రపిండాల మందం

a)

10 సెం.మీ.

b)

4 సెం.మీ.

c)

12 సెం.మీ.

d)

5 - 6 సెం.మీ.

10.

సరైన వాక్యం గుర్తించండి

a)

మూత్రపిండం వెలుపలి వైపు కుంభాకారంగానూ, లోపలివైపు పుటాకారంగానూ ఉంటుంది

b)

మూత్రపిండం వెలుపలి వైపు పుటాకారంగానూ, లోపలివైపు కుంభాకారంగానూ ఉంటుంది

11.

కుడి మూత్ర పిండం ఎందుకు కిందికి ఉంటుంది?

a)

కుడి మూత్ర పిండం బరువుగా ఉండటం వలన

b)

ఉదరకుహర కుడి భాగంలో అధిక ప్రాంతం కాలేయం ఆక్రమిస్తుంది

c)

ఉదరకుహర కుడి భాగంలో అధిక ప్రాంతం జీర్ణాశయం ఆక్రమిస్తుంది

d)

ఎడమవైపు మూత్ర పిండం తేలికగా ఉండటం వలన

12.

మూత్రపిండం పుటాకారంగా ఉన్న లోపలి తలం మధ్యలో గల పల్లాన్ని ఏమంటారు?

a)

హైలస్

b)

పైనస్

c)

గ్లోమరూలస్

d)

మాల్ఫీజియన్ దేహం

13.

మూత్రపిండం పుటాకారంగా ఉన్న లోపలి తలం మధ్యలో గల పల్లం ద్వారా లోపలికి ప్రవేశించేవి ఏమిటి?

a)

వృక్క ధమని

b)

వృక్క సిర

c)

మూత్రనాళం

d)

గ్లోమరూలస్

14.

మూత్రపిండం పుటాకారంగా ఉన్న లోపలి తలం మధ్యలో గల పల్లం ద్వారా వెలుపలకు వచ్చేవి ఏమిటి?

( 2 సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

వృక్క ధమని

b)

వృక్క సిర

c)

మూత్రనాళం

d)

గ్లోమరూలస్

15.

మూత్రాశయం స్థానం

a)

పురీషనాళానికి ఉదరతలాన

b)

వెన్నెముకకు ఇరువైపులా

c)

కాలేయానికి పక్కన

d)

ఊపిరితిత్తులకు మధ్యలో

16.

మూత్రపిండాల స్థానం

a)

పురీషనాళానికి ఉదరతలాన

b)

వెన్నెముకకు ఇరువైపులా

c)

కాలేయానికి పక్కన

d)

ఊపిరితిత్తులకు మధ్యలో

17.

మానవ శరీరంలో మూత్రాశయం స్థానం

a)

ఉదరకుహరంలో

b)

ఉరఃకుహరంలో

c)

ద్రోణి ( కటివలయ) భాగంలో

d)

పృష్ఠకుహరంలో

18.

మూత్రనాళికలకు సంబంధించిన సరికాని వాక్యం గుర్తించండి

a)

మూత్రనాళాలలో మూత్రం పెరిస్టాలిసిస్ కదలికలతో ప్రయాణిస్తుంది

b)

మూత్ర నాళికలు దాదాపు 30 సెం.మీ. పొడవు ఉంటాయి

c)

ఇవి తెల్లగా, కండరయుతంగా, సన్నగా ఉంటాయి

d)

ఇవి హైలస్ నుండి బయటకు వస్తాయి

e)

ఇవి ప్రసేకంలోనికి తెరుచుకుంటాయి

19.

మూత్రాశయం ఆకారం

a)

బేరిపండు

b)

చిక్కుడు గింజ

c)

అమీబా ఆకారం

d)

పనస గింజ

20.

మూత్రాశయం ఎంత మూత్రాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది

a)

300 - 800 మి.లీ.

b)

700 - 800 మి.లీ.

c)

300 - 400 మి.లీ.

d)

200 - 500 మి.లీ.

21.

స్త్రీలలో ప్రసేకం పొడవు ఎంత?

a)

4 సెం.మీ.

b)

20 సెం.మీ.

c)

15 సెం.మీ.

d)

6 సెం.మీ.

22.

పురుషులలో ప్రసేకం పొడవు ఎంత?

a)

4 సెం.మీ.

b)

20 సెం.మీ.

c)

15 సెం.మీ.

d)

6 సెం.మీ.

23.

చిన్న పిల్లలు మూత్ర విసర్జనను నియంత్రించలేకపోవడానికి కారణం

a)

క్రింది సంవరణీ కండరం వారి ఆధీనంలో ఉండదు

b)

పై సంవరణీ కండరం వారి ఆధీనంలో ఉండదు

c)

రెండు సంవరణీ కండరాలు వారి ఆధీనంలో ఉండవు

d)

ఎప్పుడు మూత్ర విసర్జన చేయాలో వారికి తెలియదు

24.

మూత్రాశయం గరిష్టంగా ఎంత మూత్రాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది?

a)

300 - 800 మి.లీ.

b)

700 - 800 మి.లీ.

c)

300 - 400 మి.లీ.

d)

200 - 500 మి.లీ.

25.

మానవుడు రోజుకు ఎన్ని లీటర్ల మూత్రం విసర్జిస్తాడు?

a)

1.60 - 1.8 లీ.

b)

1.50 - 1.9 లీ.

c)

1.0 - 2.0 లీ.

d)

3.0 - 3.5 లీ.

26.

మూత్ర విసర్జనకు సంబంధించిన సరికాని వాక్యం గుర్తించండి

a)

మూత్రాశయం సంకోచించడం మూలంగా మూత్రం బయటకు పోతుంది

b)

మూత్రాశయం ఉబ్బినప్పుడు స్ట్రెచ్ గ్రాహకాలు మెదడుకు ప్రచోదనాలను పంపుతాయి

c)

అధికంగా నీరు, పండ్లరసాలు తీసుకొనేవారు ఎక్కువగా మూత్రాన్ని విసర్జించటం జరుగుతుంది

d)

పై సంవరణీ కండరం మన ఆధీనంలో ఉండి మూత్ర విసర్జనను నియంత్రించగలుగుతుంది

27.

రెండు సరైన వాక్యాలు గుర్తించండి

a)

మూత్రం బయటకు వచ్చే మార్గాన్ని ఆవరించి రెండు జతల వర్తుల సంవరిణీ కండరాలు ఉంటాయి

b)

మూత్రం బయటకు వచ్చే మార్గాన్ని ఆవరించి రెండు వర్తుల సంవరిణీ కండరాలు మాత్రమే ఉంటాయి

c)

మూత్రాశయం మీద వత్తిడి పడగానే అసంకల్పితంగానే పై వర్తుల సంవరిణీ కండరం సడలుతుంది

d)

మూత్రాశయం మీద వత్తిడి పడగానే అసంకల్పితంగానే క్రింది వర్తుల సంవరిణీ కండరం సడలుతుంది

28.

స్త్రీలలో ప్రసేకం దేనిలోనికి తెరుచుకుంటుంది

a)

ఆళిందం ( vestibule )

b)

అళిందం ( allantois )

c)

గర్భాశయం

d)

సరాసరి బయటకు