Worksheetsశాంతికాంక్ష
Total questions: 20
Worksheet time: 20mins
'శాంతికాంక్ష' పాఠ్యభాగ కవి ఎవరు?
నన్నయ
తిక్కన
ఎఱ్ఱన
సోమన
తిక్కన సోమయాజి కవిత్రయం లోని ఎన్నవవారు?
మొదటివాడు
మూడవవాడు
రెండవవాడు
కవిత్రయం లో లేరు
వాస్తవంగా ఇలా జరిగింది అని అర్థం సూచించే సాహిత్య ప్రక్రియ
పురాణాలు
చారిత్రక కావ్యాలు
ప్రబంధం
ఇతిహాసం
శాంతికాంక్ష పాఠ్యభాగ నేపథ్యం
రామ రావణ యుద్ధం
కౌరవపాండవులకథ
దేవతల రాక్షసుల యుద్ధం
ఏదీ కాదు
ధర్మరాజు సంధి కోసం ఎవరిని రాయబారిగా పంపాడు?
శ్రీకృష్ణుడు
భీముడు
అర్జునుడు
కుంతి
యుద్ధం వలన కలిగే నష్టాలు
జననష్టం
ఆస్తినష్టం
క్షతగాత్రులవడం
పైవన్నీ
ధర్మరాజు అర్ధరాజ్యం కాకపోయినా ఎన్ని ఊళ్ళు ఇమ్మని అడిగాడు?
పది
ఐదు
మూడు
రెండు
యుద్ధం వలన ఎవరికి తిండికి,బట్టకి లోటు వస్తుందని ధర్మరాజు అన్నాడు?
కౌరవులకు
పాండవులకు
బంధుపరివారానికి
ఇతరులకు
పగతో నిండిన శరీరం దేనితో సమానం
పులి పంజాతో
రోగంతో
విరోధితో
పామున్న ఇంటితో
శ్రీకృష్ణుణ్ణి ఎవరి పక్షం వహించవద్దని ధర్మరాజు అన్నాడు?
పాండవుల
కౌరవుల
స్వ పక్షం
ధృతరాష్ట్రుని
యుద్ధం వలన కుల(క్షయం) కలుగుతుంది. (అర్థం)
వృద్ధి
నాశనం
సమం
ఎదుగుదల
రక్తసంబంధముచే బంధించువాడు. (వ్యుత్పత్తి పదం)
బంధువు
మిత్రుడు
శత్రువు
పొరుగువాడు
అనుకున్నది సాధించినపుడు (మోదం) కలుగుతుంది. (పర్యాయపదాలు)
కోరిక,కాంక్ష
గర్వం,అహంకారం
అరులు,వైరులు
సంతోషం,హర్షము
కృష్ణా! నీకు (నెమ్మి) తెలుసు. (నానార్ధాలు)
ప్రేమ,సర్వము
ప్రేమ,నెమలి
రహస్యము,రక్షణ
పగ,విరోధి
శాంతిని పొందడమే (కర్జము). (ప్రకృతి పదం)
కార్యం
కతము
కారణం
కార్యము
ఉత్వసంధికి ఉదాహరణ
పామున్న
ఏమేమి
రాలేను
గురూపదేశం
తమ్ముకుర్రలు (సమాసం పేరు)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
కర్మధారయ సమాసం
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
తత్పురుష సమాసం
శార్తూలం వృత్తములో వుండే గణాలు ఏవి?
భరనభభరవ
నజభజజజర
మసజసతతగ
సభరనమయవ
పగ కలిగి ఉన్న దేహం పామున్న ఇంటి వలే ఉంటుంది. (వాక్యంలోని అలంకారం)
వృత్యనుప్రాస
అంత్యానుప్రాస
ఉపమాలంకారం
ఉత్ప్రేక్ష అలంకారం
మత్తేభం వృత్తము లోని యతి స్థానం ఎన్నవ అక్షరం?
10వ
11వ
13వ
14వ
