wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

సరదా సండే *మీలో ఎవరు తెలివైన వాళ్ళు** కొంటె ప్రశ్నలు**

Total questions: 21

Worksheet time: 42mins

Name
Class
Date
1.

ఒక రోజు కరెంటు పోయింది. మహేష్ చేతిలో అగ్గిపెట్టె లో ఒకటే అగ్గిపుల్ల ఉంది. కొవ్వోత్తి, స్టౌ రెండు వెలిగించాలి.ముందుగా దీనిని వెలిగిస్తారు.?

a)

కొవ్వొత్తి

b)

అగ్గిపుల్ల

c)

స్టౌ

2.

మీ అమ్మ గారు ఉతికిన చీర ఆరుటకు అర్ధ గంట పట్టింది.అలాంటి చీరలు 10 ఆరవెస్తే ఎంత టైం పడుతుంది?

a)

ఐదు గంటలు

b)

పది గంటలు

c)

అర్ధ గంట

3.

తల ఉన్నా కాళ్ళు లేనిది.జాగ్రత్త అమ్మా అని అరుస్తావ్?

a)

పిన్నేసు

b)

గుండు సూది

c)

మిషన్ సూది

4.

ఒకటి నుండి వంద అంకెల లో తొమ్మిది లు ఎన్ని ఉంటాయి?

a)

పదకొండు

b)

పది

c)

తొమ్మిది

5.

నాలుగు ఏళ్ల అబ్బాయి కి మూడు ఏళ్ల అమ్మాయి తో వివాహం జరిగింది. వారి నిజం వయస్సు ఎంత?

a)

28,21

b)

4,3

c)

11,5

6.

తొమ్మిది లోంచి నాలుగు" తీసి వేస్తే " ఎంత?

a)

నాలుగు

b)

ఐదు

c)

తొమ్మిది

7.

ఒక ఎలక్ట్రిక్ రైలు తూర్పు వైపు చాలా వేగంగా వెళ్తే దాని పొగ యే దిశ వైపు వెళ్తుంది?

a)

పొగ రాదు

b)

పడమర వైపు

c)

దక్షిణం వైపు

8.

ఒక మేకలు కాచే వాడు ఒక మేక కు ముందు మైకు పెట్టి మాట్లాడ మన్నాడు.అది చాలా విచిత్రంగా ఇలా మాట్లాడింది. ఎలా?

a)

మైక్ టెస్టింగ్ 1,2,3 అని

b)

హలో, హలో అని

c)

మే. అని

9.

నువ్వు తూర్పు వైపు ఒక కిలోమీటర్ వెళ్ళి తర్వాత యెడమ వైపు తిరిగి రెండు కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ కుడి వైపు ఒక కిలోమీటర్ వెళ్ళావు. ఇప్పుడు నువ్వు యే దిక్కు వైపు వెళ్తున్నావు?

a)

పడమర వైపు

b)

తూర్పు వైపు

c)

ఉత్తరం వైపు

10.

మీ ఇంటికి తూర్పు న యెడమ వైపు మూల భాగాన్ని ఏమంటారు?

a)

ఆగ్నేయం

b)

నైఋతి

c)

ఈశాన్యం

11.

ఒక పిల్లి గోదావరి లో దూకి చనిపోవాలని అనుకొని దేవుణ్ణి ఇలా ప్రార్ధించింది?

a)

దేవుడా నన్ను స్వర్గానికి పంపు

b)

దేవుడా నన్ను బ్రతికించు

c)

మ్యావ్, మ్యావ్

12.

మీ అత్త కూతురు వాళ్ళ అమ్మ కొడుకు నీకు ఏమి అవుతాడు.

a)

అన్నయ్య

b)

బావ

c)

మావయ్య

13.

నువ్వు మీ ఇంటి నుండి తూర్పు వైపు మూడు కిలోమీటర్లు వెళ్ళి ఏడమకి తిరిగి రెండు km వెళ్ళి మళ్ళీ యెడమ వైపు తిరిగి మళ్లీ మూడు km వెళ్ళావు.ఇప్పుడు మీ ఇంటి నుండి నువ్వు ఎన్ని km వెళ్ళావు?

a)

8 km

b)

5 km

c)

3 km

14.

నువ్వు మీ ఇంటి నుండి తూర్పు వైపు మూడు కిలోమీటర్లు వెళ్ళి ఏడమకి తిరిగి రెండు km వెళ్ళి మళ్ళీ యెడమ వైపు తిరిగి మళ్లీ మూడు km వెళ్ళావు. ఇప్పుడు నువ్వు మీ ఇంటికి ఎంత దూరంలో ఉన్నావు?

a)

8 km

b)

0 km

c)

3 km

15.

ఒక కిలో ఇనుము, కిలో దూది రెండిటి లో ఏది బరువు ఎక్కువ?

a)

ఇనుము

b)

దూది

c)

రెండూ సమానమే

16.

అన్న, తమ్ము ' లిద్దరూ' మూడు అరటి పండ్లు ఎలా తిన్నారు?

a)

ఒక్కొక్కరు ఒకటి చొప్పున

b)

మూడు ముక్కలు చేసుకుని

c)

అన్న ఒకటిన్నర,తమ్ములు ఒకటిన్నర

17.

కాళ్ళు ఉన్నా పాదాలు లేనిది?

a)

కర్ర

b)

కుర్చీ

c)

మనిషి

18.

ఒక ఎలక్ట్రిక్ బైక్ గంటకు 60 km. వెళ్లగలదు. ఒకేలా తయారైన 5 ఎలక్ట్రిక్ బైక్ లు ఎన్ని km వెళ్లగలవు?

a)

300 km.

b)

30 km

c)

60 km

19.

ఐదు పిల్లులు ఐదు నిముషాల్లో ఐదు ఎలుకలను చంపాయి. మరి వంద నిముషాలలో వంద ఎలుకలను చంపాలంటే ఎన్ని పిల్లులు కావాలి?

a)

ఐదు

b)

పది

c)

వంద

20.

ఒక చెట్టుపై 10 కొంగలు, 8 పావురాలు ఉన్నాయి. ఒక వేటగాడు తుపాకీ పేల్చగా 1 కొంగ చనిపోగా ఇంకా చెట్టుపై ఎన్ని ఉంటాయి?

a)

9 కొంగలు, 8 పిచ్చుకలు

b)

ఏమీ ఉండవు.

c)

10 కొంగలు,. 8 పిచ్చుకలు

21.

క్విజ్ లో పాల్గొన్న అందరికీ ధన్యవాదములు. వచ్చేవారం సరదా సండే లో మళ్లీ కలుద్దాం అంతవరకూ సెలవ్. బై బై.

మీ పి.వి.సుబ్బారావు.

a)

ఎస్

b)

నో