wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

సామెతలు _ 8

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

పండగైనంక అల్లుడొచ్చినట్లు

a)

పండుగ నాడు అల్లుడు వస్తే

b)

పండుగ తరువాత అల్లుడు వస్తే

c)

అన్నీ తినడానికి అల్లుడు వస్తే

d)

అన్నీ అయ్యాక తానూ ఉన్నానని వస్తే

2.

ఉండ నీడిస్తే పండ మంచమడిగినట్లు

a)

ఉండడానికి చోటిచ్చినా పడుకోవడానికి మంచమడిగితే

b)

చోటంతా తానే తీసుకుందామని చూస్తే

c)

పోనీలే పాపమని ఉండడానికి చోటిస్తే సౌకర్యాల కోసం పరితపించినపుడు

d)

పైవన్నీ

3.

సంకల పిల్లను పెట్టుకొని అంగడంత వెదికినట్లు

a)

చంకలో పిల్ల కోసం వెతకడం

b)

తమ పిల్ల కనబడకపోతే వెతకడం

c)

దగ్గర ఉన్నదానిని చూసుకోకుండా వెతకడం

d)

ఇంట్లో చెప్పి వెళ్ళినా వెతకడం

4.

గొర్రెలు తినేటోడు పోతే బర్రెలు తినేటోడు వచ్చె

a)

గొర్రెలు ముందు తినేవాడు తరువాత బర్రెలు తింటున్నాడు

b)

మోసం చేసే వాడు వచ్చాడని

c)

గొర్రెల కాపరి బర్రెలు కాస్తున్నాడని

d)

అవినీతి ఒకరిని మించి మరొకరు చేస్తే

5.

నాయకుడు లేక నాటకమాడినట్లు

a)

నాయకుడు ఉన్నప్పుడే పనిచేస్తారని చెప్పడం

b)

ఏదో కాలయాపన చేస్తే

c)

పై రెండూ

d)

నాయకుడు లేనపుడు నాటకమాడితే

6.

నడిచే ఎద్దును పొడిచినట్లు

a)

ఎద్దు నడుస్తున్నప్పుడు పొడవడం

b)

పనిచేసే వారికే కష్టాలు

c)

ఎద్దును ఇంకా నడవమని చెప్పడం

d)

నడవని ఎద్దును నడవమనడం

7.

తెగిన బొక్కెన నూతుల్దాక 

a)

తెగించినపుడు అంతం చూడక తప్పదు 

b)

తెగిన బొక్కెనకు నుయ్యి గురించి తెలుస్తుంది 

c)

దిగినాక లోతు తెలుస్తుంది 

d)

ఏదీ కాదు 

8.

గోరుచుట్టు మీద రోకటి పోటు

a)

గోరు చుట్టూ రోకలితో కొట్టడం

b)

తగిలిన దాని మీదనే తగలడం

c)

తప్పుచేసినవారిని కొట్టడం

d)

ఏమీ చేయనివారిని అనవసరంగా నిందించడం

9.

ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

a)

ఇంట్లో ఈగలు ఉండడంతో బయటకు తరమాలనుకోవడం

b)

అవకాశం వచ్చినపుడు వినియోగించుకోవడం

c)

కష్టం వచ్చినపుడు ఓర్చుకోవడం

d)

తినడానికి ఏమీ లేకున్నా ఆడంబరం చూపిస్తే

10.

మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట

a)

మాటలు వచ్చాక బాగా మాట్లాడతారు

b)

కుక్కలకు మాటలు రావు

c)

తెలివైన వారు ఎగదోసినప్పుడు

d)

తెలివి లేనివారు ఎగదోసినపుడు