wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

కణ నిర్మాణం - విధులు

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

సరికాని వాక్యాన్ని గుర్తించండి

a)

ప్లాస్మా పొర సెల్యులోజ్ తో నిర్మితమై ఉంటుంది

b)

కణకవచం కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తూ రక్షణ కలిగిస్తుంది

c)

ప్లాస్మా పొర ప్రొటీన్లు లిపిడ్లు తో నిర్మితమై ఉంటుంది

d)

కణంలో సమతాస్థితి నిర్వహణలో ప్లాస్మా పొర ప్రధాన పాత్ర వహిస్తుంది

2.

కేంద్రకంలో ప్లాస్మా పొర ను పోలి ఉండే భాగం

a)

కనకవచం

b)

కేంద్రక త్వచం

c)

మైటోకాండ్రియా

d)

గాల్జీ సంక్లిష్టం

3.

జతపరచండి

1. మైటోకాండ్రియా. A. ప్రోటీన్లు సంశ్లేషణ లో ప్రధాన పాత్ర వహిస్తాయి

2. హరితరేణువు. B.0.5 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటాయి

3. అంతర్జీవ ద్రవ్యజాలం. C. 4 - 10 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటాయి

4. రైబోజోమ్ లు. D. వీటిపైన రైబోజోమ్ లు ఉంటాయి

a)

1- A, 2 - B, 3 - C, 4 - D

b)

1 - B, 2- D, 3 - C, 4 - A

c)

1 - B, 2 - C, 3 - D, 4 - A

d)

1 - B, 2 - C, 3 - A, 4 - D

4.

సరైన వాటిని గుర్తించండి

A. ప్లాస్టిడ్స్ మొక్కల్లో మాత్రమే ఉంటాయి

B. క్రోమోప్లాస్ట్స్ వర్ణరహితంగా ఉంటాయి

C. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం కొవ్వు అణువుల సంశ్లేషణ కు తోడ్పడుతుంది

D. సకశేరుకాల లోని కాలేయ కణాలలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేక విష పదార్థాలు మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ప్రధానపాత్ర వహిస్తుంది.

a)

A and B and D

b)

A and D

c)

A and B

d)

A and B and C and D

5.

1.ఈ కణాంగాలు లు కణత్వచంలను పునరుత్పత్తి చేయడంలో కానీ మరమ్మత్తు చేయడంలో తోడ్పడుతాయి. - లైసోసోమలు

2. ఎంజైమ్స్ లేదా హార్మోన్లను స్రవించే కణాలలో గాల్జీ సంక్లిష్టం ఎక్కువగా ఉంటాయి.

3. లైసోజోములను స్వయం విచ్ఛిత్తి సంచులు అంటారు

a)

1 మరియు 2 సరైనవి

b)

1 మరియు 3 సరైనవి

c)

1 మాత్రమే సరైనది

d)

2 మరియు 3 సరైనవి

6.

సరికాని వాటిని గుర్తించండి.

A. ప్లాస్మా పోర ను విచక్షణ స్థరం అంటారు.

B. జీర్ణక్రియ ఎంజైములు ను కలిగి త్వచం తో కూడిన సంచులు వంటి నిర్మాణాలు లైసోజో ములు.

C. ఘణ, ద్రవ పదార్థాలు నిల్వ చేసే సంచులు వంటి నిర్మాణాలు రిక్తికలు.

D. కణాల విభజన రుడాల్ఫ్ వీర్కొవ్ కనుగొన్నాడు.

a)

A and B and C

b)

A and D and B

c)

A and B and C and D

d)

అన్నీ సరైనవి

7.

1. కణం మరియు బాహ్య పరిసరాల మధ్య జరిగే పదార్థాల వినిమయాన్ని నియంత్రించటం ప్లాస్మా పొర యొక్క ప్రత్యేక లక్షణం.

B. కణరసం ద్వారా ఏర్పడే బాహ్య పీడనాన్ని నిరోధించడానికి కనకవచం అంతర పీడనాన్ని కలిగిస్తుంది.

C. అన్ని క్షీరదాల ఎర్రరక్తకణాలలో కేంద్రకం ఉండదు.

a)

A and B and C సరైనవి కావు

b)

A and C సరైనవి

c)

A and B and C సరైనవి

d)

A and B సరైనవి

8.

కేంద్రక పూర్వ కణాలను గుర్తించండి

a)

బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు

b)

బ్యాక్టీరియా, రియో పత్రం

c)

నీలి ఆకు పచ్చ శైవలాలు, వృక్ష కణాలు

d)

అన్ని రకాల జంతు మరియు వృక్ష కణాలు

9.

1. కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు దీని ద్వారా ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి జరుగుతుంది - కేంద్రకం.

2. కనకవచం వల్ల వృక్ష కణానికి పరిసరాల్లో జరిగే మార్పులను తట్టుకొనే శక్తి జంతుకణం కంటే ఎక్కువగా ఉంటుంది.

a)

1 సరి అయింది

b)

2 సరైనది

c)

1 మరియు 2 సరైనవి

d)

1 మరియు 2 సరైనవి కావు

10.

జతపరచండి

1. కేంద్రకం. A. ప్రతి కణంలో దాదాపు 100 నుంచి 150 ఉంటాయి

2. కేంద్రక పూర్వ కణం. B. సౌర శక్తిని గ్రహించి రసాయన శక్తిగా మారుస్తాయి.

3. హరిత రేణువులు. C. త్వచం లేని రైబోజోము ల ను కలిగి ఉంటుంది.

4. మైటోకాండ్రియా. D. సైటో బ్లాస్ట్ లు

a)

1. A, 2. B, 3. C, 4. D

b)

1. D, 2. C, 3. B, 4. A

c)

1. D, 2. C, 3. A, 4.B

d)

1.B, 2. C, 3. D, 4. A

11.

1. కణం లో జరిగే కొన్ని జీవ రసాయనిక చర్యలకు వేదికగా పనిచేసేది - గాల్జీ సంక్లిష్టం.

2. వివిధ రకాల పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు రవాణా చేసే ముందు తమ లో నిల్వ చేసుకుంటాయి. - అంతర్జీవ ద్రవ్యజాలం.

a)

1 మాత్రమే సరైనది

b)

1 మాత్రమే సరికానిది

c)

1 మరియు 2 సరైనవి

d)

1 మరియు 2 సరికానిది

12.

త్వచపు దొంతరలతో కోశాలు కలిగిన నిల్వచేసే నిర్మాణాలు.

a)

గాల్జీ సంక్లిష్టం

b)

మైటోకాండ్రియా

c)

అంతర్జీవ ద్రవ్యజాలం

d)

రైబోజోమ్ లు

13.

1. వినాశనం కావలసిన పదార్థాలను జీర్ణం చేసుకునేవి. - హరిత రేణువులు.

2. కణానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ ను జరిపేవి - మైటోకాండ్రియాలు.

3. ఇవి ప్రోటీన్లు సంశ్లేషణ లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. - రైబోజోమ్ లు.

a)

1 మరియు 2 సరైనవి

b)

1 మరియు 2 సరైనవి కావు

c)

2 మరియు 3 సరైనవి

d)

2 మరియు 3 సరైనవి కావు

14.

RNA మరియు ప్రోటీన్లతో ఏర్పడేవి.

a)

గాల్జీ సంక్లిష్టం

b)

హరిత రేణువులు

c)

మైటోకాండ్రియా

d)

రై బో జోములు

15.

కణవిభజన లో ప్రధాన పాత్ర పోషించేది

a)

జీవపదార్థం

b)

కణ ద్రవ్యం

c)

కేంద్రకం

d)

రిక్తికలు

16.

1. మైటోకాండ్రియా. A. అంతర్జీవ ద్రవ్యజాలం కి అతికి ఉండేవి.

2. అంతర్జీవ ద్రవ్యజాలం. B. 2 - 8 మైక్రాన్ప పొడవులిగి ఉంటాయి

3. రిక్తికలు. C. కణ ద్రవ్యమంత వల లాంటి త్వచం తో వ్యాపించి ఉన్నట్లు కనబడుతుంది.

4. హరిత రేణువులు. D. ఆకుపచ్చగా ఉంటాయి

5. రైబోజోమ్ లు. E. కణంలో కుడ్య పీడనాన్ని నియంత్రి స్థాయి.

a)

1.A, 2. B, 3.C, 4. E, 5. D.

b)

1. B, 2. C, 3. E, 4. D, 5. A.

c)

1. E, 2. A, 3. D, 4. C, 5.B.

d)

1.A, 2. B, 3. C, 4. D, 5. E.

17.

వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే వి.

a)

లై సో జోములు

b)

మైటోకాండ్రియా

c)

గాల్జీ సంక్లిష్టం

d)

రిక్తికలు

18.

వాక్యం 1: కామిల్లో గాల్జి - గాల్జీ సంక్లిష్టం ని సంయుక్త సూక్ష్మదర్శినిలో పరిశీలించాడు.

వాక్యం 2: గాల్జీ సంక్లిష్టం లోపల ఉన్న ఇతర భాగాలను ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే స్పష్టంగా పరిశీలించగలరు.

a)

1 మరియు 2 సరైనవి కావు

b)

1 మాత్రమే సరైనది.

c)

2 మాత్రమే సరైనది

d)

1 మరియు 2 సరైనవి

19.

1. రసభరితంగా ఉండే సంచుల వంటి నిర్మాణాలు - గాల్జీ సంక్లిష్టం.

2. కాంతి తీవ్రత ను తగ్గించే కొద్ది త్రిమితీయ ప్రతిబింబాన్ని స్పష్టంగా పరిశీలించవచ్చు.

3. సూక్ష్మదర్శినిలో కణ మందం చూడలేము.

a)

1 and 2 Correct

b)

1 and 3 Correct

c)

2 and 3 Correct

d)

2 and 3 Wrong

20.

మైటోకాండ్రియా లో గీత గీసిన భాగం.

a)

బాహ్య త్వచం

b)

అంతర త్వచం

c)

క్రీస్తే

d)

మాత్రిక