wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10 రక్త నాళాలు మరియు రక్త ప్రసరణ ( 3 ప్రసరణ)

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.

కాలిలోని సిరలను గురించి అధ్యయనం చేసిన శాస్త్రవేత్త

a)

గైరోలమా ఫాబ్రిసి

b)

విలియం హార్వే

c)

మార్సెల్లో మాల్ఫీజి

d)

రెని లెన్నెక్

2.

గైరోలమా ఫాబ్రిసి ఏ దేశానికి చెందిన వారు?

a)

ఇటలీ

b)

బ్రిటన్

c)

ఫ్రెంచ్

d)

భారత్

3.

ఏ సంవత్సరంలో ఫాబ్రిసీ సిరలను గురించి అధ్యయనం చేశారు?

a)

1574

b)

1650

c)

1661

d)

1816

4.

గైరోలమా ఫాబ్రిసి అంతగా పట్టించుకోని అతిముఖ్యమైన విషయం

a)

రక్తం ఎప్పుడూ ఎడమ జఠరిక నుండి శరీర భాగాలకు ప్రవహిస్తుంది

b)

రక్తం ఎప్పుడూ కుడి జఠరిక నుండి ఊపిరితిత్తులకు ప్రవహిస్తుంది

c)

కుడి కర్ణికకు, కుడి జఠరికకు మధ్య అగ్రత్రయ కవాటం ఉంటుంది

d)

ఎడమ కర్ణికకు, ఎడమ జఠరికకు మధ్య అగ్రద్వయ కవాటం ఉంటుంది

5.

విలియం హార్వే ఏ దేశానికి చెందిన వారు?

a)

ఇటలీ

b)

బ్రిటన్

c)

ఫ్రెంచ్

d)

భారత్

6.

విలియం హార్వే ఏ శాస్త్రవేత్త దగ్గర అధ్యయనం చేశారు?

a)

గైరోలమా ఫాబ్రిసి

b)

మార్సెల్లో మాల్ఫీజి

c)

రెనె లెన్నెక్

d)

వాల్టర్ ఫ్లెమింగ్

7.

కర్ణికలు, జఠరికలలోని కవాటాలను గురించి అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు?

a)

విలియం హార్వే

b)

గైరోలమా ఫాబ్రిసి

c)

మార్సెల్లో మాల్ఫీజి

d)

లెవోయిజర్

8.

గుండె సంకోచించినపుడు _____

a)

రక్తం జఠరికలనుండి ధమనులలోకి వెళుతుంది

b)

రక్తం జఠరికలనుండి కర్ణికలలోకి వెళుతుంది

c)

రక్తం కర్ణికలనుండి సిరలలోనికి వెళుతుంది

9.

రక్త ప్రవాహాన్ని గురించి అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు?

a)

విలియం హార్వే

b)

గైరోలమా ఫాబ్రిసి

c)

మార్సెల్లో మాల్ఫీజి

d)

లెవోయిజర్

10.

విలియం హార్వే కు సంబంధించి కింది వాటిలో సరికానిది గుర్తించండి

a)

ఒక గంటలో గుండె మనిషి బరువుకు మూడురెట్ల రక్తం పంపిణీ చేస్తుందని కనుగొన్నారు

b)

గుండె నుండి శరీరానికి చేరిన రక్తం వినియోగించబడి మరలా కొత్త రక్తం ఏర్పడుతుందనే భావన తప్పని నిరూపించాడు

c)

రక్తానికి రెండు ప్రవాహాలు ఉన్నాయి

d)

ధమనులలో రక్తం గుండె నుండి శరీర భాగాలకు ప్రవహిస్తుంది

e)

ధమనులు, సిరలను కలుపుతూ వాటి మధ్య అతి సన్నని రక్త నాళాలు ఉంటాయి

11.

ఏ సంవత్సరంలో శాస్త్రజ్ఞులు భూతద్దాలను కలిపి వాడటం ద్వారా కంటితో చూడలేని అతిచిన్న వస్తువులను కూడా పెద్దవిగా చూపే విధానాన్ని కనుగొన్నారు?

a)

1574

b)

1650

c)

1661

d)

1816

12.

ఏ సంవత్సరంలో మార్సెల్లో మాల్ఫీజి తన పరిశోధనలు చేశారు?

a)

1574

b)

1650

c)

1661

d)

1816

13.

మార్సెల్లో మాల్ఫీజి వేటిపై అధ్యయనం చేశారు?

a)

గబ్బిలం రెక్కలు

b)

గుండెలోని కవాటాలు

c)

కాలిసిరలలోని కవాటాలు

d)

క్లోమంలోని పుటికల పైన

14.

విలియం హార్వే ఎదుర్కొన్న సమస్య ఏమిటి?

a)

ధమనులను, సిరలను కలుపుతూ వాటి మధ్య అతి సన్నని రక్త నాళాలు నిజంగా ఉన్నాయా?

b)

గుండెలో నిజంగా కవాటాలు ఉంటాయా?

c)

ధమనులలో కూడా కవాటాలు ఉంటాయా?సిరలలోని రక్తం గుండె వైపునకు మాత్రమే ప్రవహిస్తుందా?

d)

రక్తం గడ్డకట్టడానికి కారణం ఏమై ఉంటుంది

15.

Capillaries ఏ భాషా పదం?

a)

లాటిన్

b)

ఉర్దూ

c)

ఇంగ్లీష్

d)

గ్రీకు

16.

Capillaries అంటే అర్థం?

a)

కేశం

b)

రక్తం

c)

నాళం

d)

గుండె

17.

రక్తకేశనాళికలకు సంబంధించిన సరికాని వాక్యం గుర్తించండి

a)

రక్తకేశనాళికలు ఏక కణ మందంతో నిర్మితమైన సూక్ష్మమైన నాళాలు

b)

ఇవి తమగుండా పదార్థాలు వ్యాపనం చెందడానికి అనుమతిస్తాయి

c)

తెల్ల రక్త కణాలలోని ల్యూకోసైట్లు సూక్ష్మ కేశ నాళికల గోడల గుండా చొచ్చుకొని పోగలవు

d)

ఇవి ధమనులు సిరలను కలుపుతూ రక్త నాళికా జాలాన్ని ఏర్పాటు చేస్తాయి

e)

రక్తకేశనాళికలలో కూడా కవాటాలు ఉంటాయి

18.

గబ్బిలం రెక్కలో ఉండే అతి పలుచని పొరను ఏమంటారు?

a)

పెటాజియం

b)

వెబ్

c)

ప్లూరా

d)

మెనింజస్