wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

పరిచిత పద్యము - ప్రశ్నలు

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.
  1. 1 . కింది పరిచిత గద్యాంశమును చదివి, అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఎంచుకుని రాయండి. 

   

     (అ )   “వారీరామచంద్రా”! అనిసంబోధించడం ‘ఇగపటు’ అనటంవింతగాఅనిపిస్తుందికదా ! అదివారికిపసందైనప్రాంతీయభాషా,ఇక్కడొకచిన్నముచ్చటయాదిచేసుకుంటున్నాను. ఈనడుమవ్యాసపూర్ణిమసందర్భానబాసరసరస్వతిక్షేత్రంలోఎందరోవ్యాసవాక్మయంమీదఅధికారమున్నపండితులు, పౌరాణికులుప్రసంగించారు. ఒకనాటివ్యాసభారతంమీదప్రసంగంఉస్మానియాయూనివర్సిటీనుంచిసంస్కృతంప్రొఫెసర్గాఉద్యోగవిరమణచేసివిశ్రాంతజీవితంగడుపుతున్నకె.కమలగా రుచేసినారు. ఆమెనుచూస్తూవుంటే, వాగ్దాటివింటూవుంటేఎవరోయాదికివచ్చినారు. మధ్యాహ్నంభోజనసమయంలోఆమెనుపరిచయంచేసుకున్నాను.ఆమెకప్పగంతులలక్ష్మణశాస్త్రిగారికుమార్తె. మాగురుపుత్రిక, నమస్కరించినాను.లక్ష్మణశాస్త్రిగారుమహబూబ్నగర్జిల్లాలోనివనపర్తిసంస్థానానికిచెందినవారు. నిజాంకాలంలోసమాచార, పౌరసంబంధాలశాఖలోఅసిస్టెంట్డైరెక్టర్గాఉద్యోగంలోచేరి, చివరికిస్కూల్ఎడ్యుకేషన్డైరెక్టర్ఆఫీసులోడిప్యూటీడైరెక్టర్ఫర్ఓరియంటల్లాంగ్వేజ్పదవిలోఉద్యోగవిరమణచేసినారు.            

  1. 1 . వారీ రామచంద్రా”! అని సంభోదించటం ‘ఇగపటు’ అనటం మనకు ఏ అనుభూతిని కలిగిస్తుంది?

a)

కొత్తగా అనిపిస్తుంది

b)

వింతగా అనిపిస్తుంది

c)

పాతగా అనిపిస్తుంది

d)

ఏది అనిపించదు

2.

వ్యాసపూర్ణిమ సందర్భాన ఏ క్షేత్రంలో పండితులు, పౌరాణికులు ప్రసంగించారు?

a)

శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో

b)

తిరుపతి వెంకన్న క్షేత్రంలో

c)

బాసర సరస్వతి క్షేత్రంలో

d)

యాదగిరి నరసింహా క్షేత్రంలో

3.

కె. కమల గారు ఏ విషయం మీద ప్రసంగం చేసినారు?

a)

ఒకనాటి మహాభారతం

b)

ఒకనాటి రామాయణం

c)

ఒకనాటి వ్యాస భారతం

d)

ఒకనాటి భాగవతం

4.

కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె గారు ఏ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేసినారు?

a)

ఉస్మానియా యూనివర్సిటీ

b)

పద్మావతి యూనివర్సిటీ

c)

కాకతీయ యూనివర్సిటీ

d)

తెలంగాణా యూనివర్సిటీ

5.

లక్ష్మణశాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని ఏ సంస్థానానికి చెందినవారు?

a)

ఆందోల్ సంస్థానానికి

b)

గద్వాల సంస్థానానికి

c)

వనపర్తి సంస్థానానికి

d)

గోల్కొండ సంస్థానానికి

6.

ఆ ) ఈ క్రింది పరిచిత గద్యం చదివి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం రాయండి.

పెద్ద కాళోజీ వర్దంతి సభలో అధ్యక్షుల వారు మాట్లాడిన తరువాత సామల సదాశివ గారిని మాట్లాడమన్నారు . అప్పుడు సదాశివ “అధ్యక్షుల వారి కల్తీలేని తెలుగు విన్న తర్వాత తెలుగుమాట్లాడే సాహసం చేయను. ఉర్ధూలో మాట్లాడుతాను“ అని మాట్లాడే నాలుగు మాటలు ఉర్ధూలొనే మాట్లాడినాను .అధ్యక్షులవారిలాగే కల్తీలేని వరంగల్లు తెలుగు మాట్లాడే ఆచార్యులు కొందరున్నారక్కడ. ఇతరులూ ఉన్నారు. వార్తా పత్రికలో కొన్నాళ్ళు ఉర్ధూ కవులగురించి రాసినాను .ఇప్పుడు యాది రాస్తున్నాను .ఆకాలంనుంచి నా రచనలు చదువుతున్న గుంటూరు విద్వాంసులు, అడ్వకేట్ ఉప్పలూరి గోపాల కృష్ణశర్మగారు నా వ్యాసాలు బాగున్నాయని జాబులు రాస్తున్నారు. తరచూ “మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది. మీరు ఆప్రాంతం వారేనా?మాప్రాంతానికి ఎప్పుడూ రాలేదా ? ”అని ప్రశ్నిస్తూ ఉంటారు. వారు ఏ ఉద్దేశంతో అట్లా ప్రశ్నిస్తారో తెలియదుగాని అది నా ప్రశంసగానే భావిస్తాను. తెలంగాణాలోనే ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివేటట్లు రాస్తున్నానంటే విశేషమే కదా.


1. సదాశివ గారికి జాబులు రాసేది ఎవరు ?

a)

ఉప్పెన గోపాలకృష్ణ శర్మ

b)

ఉపాలూరి గోపాలరెడ్డి

c)

ఉప్పు గోపాలచౌదరి

d)

ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ

7.

సభలో సామల సదాశివ ఏభాషలో మాట్లాడారు ?

a)

తెలుగు

b)

ఉర్దూ

c)

మరాఠి

d)

హిందీ

8.

ఇందులో విశేషం ఏది ?

a)

తెలంగాణాలో ఉండి ఆంధ్ర ప్రాంతంవాళ్ళు చదివేటట్లు రాయడం

b)

ఆంధ్ర ప్రాంతం లో ఉండి తెలంగాణా ప్రాంతంవాళ్ళు

c)

పైరెండు సరైనవే

d)

పై వేవీ సరైనవి కావు

9.

‘యాది’ అంటే ?

a)

స్మృతి, జ్ఞాపకం

b)

జ్ఞాపకం , మఱుపు

c)

స్మృతి, కృతి

d)

గుర్తు , సంకేతం

10.

ఈక్రింది వానిలో ‘ఉత్తరాలు’ అని అర్ధం వచ్చే పదం ఏది ?

a)

జవాబులు

b)

జాబులు

c)

వ్యాసాలు

d)

ప్రత్యుత్తరాలు

11.

   ఇ)   సదాశివ తెలుగులోను, ఉర్దూలోను ఎందరెందరి దగ్గర ఏమేమి నేర్చుకున్నాడో అదంతా 

రాయాలంటే ఒక పుస్తకమవుతుంది. ఇక్కడ  సదాశివ రాస్తున్నది ప్రాంతీయ భాష పలుకుబడి 

గురించి. పలుకుబడి, నుడికారం, జాతీయాలు అనే వాటికి ఉర్ధూలో చాలా ప్రాముఖ్యం వున్నది 

వాటిని రోజ్ మర్రా, మొహావిరా అంటారు. వరంగల్లు తెలుగును టాక్సాలీ తెలుగు అనవచ్చు. డిల్లీ ఉర్దూను టాక్సాలీ ఉర్దూ  అంటారు. టక్సాలీ అంటే టంకసాల . టంకసాలలో తయారయ్యే  నాణేలకే విలువ. ఇతరులెవరైనా తయారుచేస్తే అవి నకిలీ నాణేలు. అవి చెలామణిలో లేవు. పైగా ప్రభుత్వం జప్తు చేస్తుంది. 


  1. 1. ఈ పైరాలో సదాశివ దేని గురించి రాశారని తెలుస్తోంది?

a)

తమిళం

b)

హిందీ

c)

ప్రాంతీయభాషా పలుకుబడి

d)

ఏదీకాదు

12.

తెలుగులోని వేటికి ఉర్దూలోచాలా ప్రాముఖ్యం ఉంది?

a)

పలుకుబడి

b)

నుడికారం

c)

జాతీయాలు

d)

అన్నీ

13.

ఎక్కడ తయారయే నాణేలకు విలువ?

a)

టంకశాల

b)

కల్తీ

c)

నఖిలి

d)

బ్యాంకు

14.

వరంగల్లు తెలుగును ఏ తెలుగు అనవచ్చు?

a)

వరంగలీ

b)

టాక్సాలీ

c)

ఓరుగలి

d)

ఏకశిల

15.

టాక్సాలీ ఉర్దూ ఏ ఉర్దూ అంటారు ?

a)

డిల్లీ

b)

బొంబాయి

c)

హైద్రాబాద్

d)

వరంగల్

16.

జాతీయాలు అనే వాటికి ఉర్ధూలో ఏమని పేరు ?

a)

రోజ్ రా , మొహావిరా

b)

రోజ్ మర్రా, మొహావిరా

c)

రోజ్ క ర్రా, మొహారా

d)

రోజ్ మర్రా, మొగవరె

17.

ఈ ) క్రింది గద్యాన్ని చదువండి. ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించండి.

గో మెరే షేర్ హైఁ ఖవాస్ పసంద్
పర్ మెరీ గుప్తగూ అవామ్ సేహై
“ఖాస్ – ఆమ్ అనే రెండు మాటలున్నాయి. ఖాన్ అంటే ప్రత్యేకమైనది. (స్పెషల్) దాని బహువచనం ఖవాస్. అంటే విద్వత్తులోనో, సంపదలోనో, హోదాలోనో ప్రత్యేకమైనవాళ్లు. ఆమ్ అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు (కామన్ పీపుల్), కవి ఏమంటున్నాడంటే, “నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు కాని నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే” అని.

అ) ‘ఖాస్ అనే ఉర్దూ పదానికి అర్థం

a)

ఎ) కవిత

b)

బి) ప్రత్యేకమైన

c)

సి) సాధారణమైన

d)

డి) సామాన్యం

18.

ఆ) సామాన్య ప్రజలను ఉర్దూలో ఏమంటారు ?

a)

ఎ) అవామ్

b)

బి) ఆమ్

c)

సి) ఖాస్

d)

డి) ఖవాస్

19.

ఇ) నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ జేస్తున్నారు. క్రింద గీత గీసిన పదానికి సమానార్థక ఉర్దూపదం.

a)

ఎ) సంబంద్

b)

బి) అవామ్

c)

సి) ఖవాస్

d)

డి) పసంద్

20.

ఈ) పై కవితలో కవి ఎవరి భాషను ఉపయోగించాడు ?
ఎ) గ్రాంథికభాష
బి) ఉర్దూభాష
సి) ప్రజలభాష
డి) ఏవీకాదు

a)

ఎ) గ్రాంథికభాష

b)

బి) ఉర్దూభాష

c)

సి) ప్రజలభాష

d)

డి) ఏవీకాదు