WorksheetsTelugu Grammar - 1
Total questions: 10
Worksheet time: 5mins
1) సాదృశ్యము - అనగా
అ) దృశ్యము
ఆ) అదృశ్యము
ఇ) వలనే
ఈ) అలానే
2) రాజులు , ప్రభువులు - పర్యాయపదాలుగా కలిగిన పదం ______
అ)భూవరులు
ఆ)పరులు
ఇ) సోదరులు
ఈ)తస్కరులు
3) పుత్రుడు , సుతుడు - పర్యాయపదాలుగా కలిగిన పదం
అ) ద్విజుడు
ఆ) ఆత్మజుడు
ఇ) మూర్ఖుడు
ఈ) సోదరుడు
4) పేరు , గుర్తు - నానార్థాలుగా కలిగిన పదం ______
అ)సంధ్య
ఆ) సంజ
ఇ) సంఖ్య
ఈ) సంజ్ఞ
5) పండితుడు - వ్యతిరేకపదం
అ) అపండితుడు
ఆ) బ్రాహ్మణుడు
ఇ) పామరుడు
ఈ) జ్ఞాని
6) వాలము - అర్థము
అ) తోక
ఆ) తల
ఇ) కొమ్ము
ఈ) ముఖము
7) వదనము - పర్యాయపదాలు
అ) వందనము, ముఖము
ఆ) ముఖము , ఆననము
ఇ)ఆనందము , ఆననము
ఈ) వక్త్రము , వందనము
8) అర్థము - నానార్థాలు
అ) ప్రయోజనం , తెలివి
ఆ)శబ్దార్థం , ధనం
ఇ) శతాబ్ధం , శబ్దార్థం
ఈ) ధనం , వ్యర్థం
9) కొలనులో తామరపూలు చాలా అందంగా ఉన్నాయి. అందంగా అనేది ______
అ) అవ్యయం
ఆ) సర్వనామం
ఇ) క్రియ
ఈ) విశేషణం
10) చతుర్థి విభక్తి ప్రత్యయాలు ______
అ) డు ,ము , వు, లు
ఆ) కొరకు(న్), కై , కోసం
ఇ) వలన (న్), కంటె (న్) , పట్టి
ఈ) ని(న్ ) , ను(న్), ల(న్) , కూర్చి , గురించి
