Worksheetsతెలుగు ప్రహేళిక
Total questions: 15
Worksheet time: 15mins
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా? గిట్టదా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
పై పద్యం ఎవరి గురించి చెపుతుంది?
దయగల పుత్రుని గురించి
ఆదర్శవంతుడైన కొడుకు గురించి
దయలేని పుత్రుని గురించి
చెడ్డ కుమారుని గురించి
పై పద్యంలో కవి పుత్రుడిని వేటితో పోల్చాడు?
చీమలు
చెదలు
జంతువులు
ఏదీ కాదు
పై పద్యంలో మకుటం ఏది?
దయలేని పుత్రుండు
పుట్టదా? గిట్టదా?
వాడు గిట్టనేమి?
విశ్వదాభిరామ! వినురవేమ!
'అమ్మ కోసం' పాఠం రచించిన కవి ఎవరు?
ఎఱ్ఱన్న
తిక్కన
నన్నయ
పోతన
ఈ పాఠం శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఏ పర్వం నుంచి గ్రహించారు?
ఆది పర్వం
సభా పర్వం
అరణ్య పర్వం
విరాట పర్వం
అనూరుడు ఎవరి రథసారథి?
చంద్రుని
వాయుదేవుని
ఇంద్రుని
సూర్యుని
కద్రువ కుమారులు ఎంతమంది?
వంద
వెయ్యి
లక్ష
కోటి
కద్రువకు దాస్యం చేస్తున్నది ఎవరు?
వినత, వినత కుమారుడు(గరుత్మంతుడు)
వినత,అనూరుడు
అనూరుడు,గరుత్మంతుడు
ఉరగులు
కొడుకులు శక్తిమంతులైతే తల్లిదండ్రులకు ఇవి తొలగిపోతాయి?
ఆనందాలు
సుఖాలు
కష్టాలు
సంతోషాలు
అమృతాన్ని రక్షిస్తున్నదెవరు?
భయంకరమైన సర్పాలు
కద్రువ కుమారులు
అనూరుడు
ఇంద్రుడు
'ఉరగము' సమానార్థక పదాలను గుర్తించండి.
ఇనుడు,సూర్యుడు,రవి
పాము,సర్పము,ఫణి
హస్తము,పాణి, చేయి
సింహం,మృగరాజు, కేసరి
క్రింది వానిలో అసమాపక క్రియ కానిది.
తిని
వెళ్లి
వెళ్ళాడు
చూసి
'అత్యుగ్రము' పదాన్ని విడదీసి రాయండి.
అతి + ఉగ్రము
అతీ + ఉగ్రము
అత్యు + గ్రము
అత్య + ఉగ్రము
'చిట్టచివర' సంధి గుర్తించండి.
యణాదేశసంధి
గుణసంధి
రుగాగమ సంధి
ఆమ్రేడిత సంధి
'అమ్మకోసం' పదానికి గురులఘువులు గుర్తించండి.
IIUU
IUUI
UIUU
UUUU
