wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Sandhulu in model papers

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

దసరా ఉత్సవాలకు ప్రభుత్వం గొప్పగా ఏర్పాట్లను చేసింది. భక్తులు అందరూ తమ తమ శక్తి కొలది జగన్మాత సేవలో పాల్గొంటున్నారు. వేలాదిగా వచ్చిన భక్తులకు ఏ లోటు రాకుండా ఉత్సవ కమిటీ వారు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

# ఈ వాక్యాలలో అనునాసిక సంధి పదాన్ని గుర్తించండి

a)

జగన్మాత

b)

ఉత్సవ కమిటీ

c)

పాల్గొంటున్నారు

d)

భక్తులందరూ

2.

సజ్జనులు మహోపకారం చేస్తారు. అందువలన సజ్జనులకు అందరూ సన్మిత్రులే అవుతారు.

# ఇందలి గుణ సంధి పదం గుర్తించండి

a)

మహోపకారం

b)

సజ్జనులు

c)

సన్మిత్రులు

d)

అందువలన

3.

రాజమహేంద్రవరం లోని గోదావరి నది ప్రవాహం అత్యంత ఉగ్రరూపం దాల్చినది. జీవనోపాధిని కోల్పోయిన సామాన్య ప్రజానీకం చాలా మనస్థాపమునకు గురైనారు. #ఇందలి గుణ సంధి పదాన్ని గుర్తించండి

a)

జీవనోపాధి

b)

అత్యంత

c)

మనస్తాపం

d)

గురైనారు

4.

నట్టడవిలో చింతాకు దొరుకుతుంది. పల్లెటూరు లోని రామయ్య అందుకోసం అడవికి వెళ్ళాడు. #టుగాగమ సంధి పదాన్ని గుర్తించండి

a)

పల్లెటూరు

b)

నట్టడవి

c)

చింతాకు

d)

రామయ్య

e)

దొరుకుతుంది

5.

ఈ సహస్రాబ్దం లో మానవులంతా నిరాశకు గురైన సంఘటన కరోనా వ్యాధి వ్యాపించడం. వారంతా జీవనోపాధిని కోల్పోయి దుఃఖించారు.

#సవర్ణ దీర్ఘ సంధి పదాన్ని గుర్తించండి.

a)

సహస్రాబ్దం

b)

మానవులంతా

c)

నిరాశ

d)

గురైన

e)

జీవనోపాధి

6.

పరోపకారం ఉత్తముల సహజ లక్షణం. ఇది తరతరాలుగా పరంపరగా అందరూ అంగీకరించిన సత్యం. అన్యుల పై దురభిమానం సజ్జనుల లక్షణం కాదు. కావున అందరినీ సన్మిత్రులుగా భావించడం మానవోత్తముల కర్తవ్యం.

# ఇందలి విసర్గ సంధి పదాన్ని గుర్తించండి.

a)

దురభిమానం

b)

పరోపకారం

c)

సన్మిత్రులు

d)

సజ్జనులు

e)

మానవోత్తములు

7.

మందిరంపై పావురాల గుంపు ను చూసింది ఒక భక్తురాలు. వాటి తిండికోసం గింజలు చల్లింది. గింజలను చూసిన పక్షులు వాటి వద్ద వాలాయి. ఆనందంగా తిని ఎగిరిపోయాయి.

# ఇందలి లు,ల,న,ల సంధి పదాన్ని గుర్తించండి

a)

పావురాలు

b)

భక్తురాలు

c)

పక్షులు

d)

ఆనందంగా

8.

భారతీయ స్త్రీలు సంస్కారవంతులు. వారు నిరంతరము నియమనిష్ఠలతో జీవనము సాగిస్తున్నారు. అందుకే అనేకమంది రాజులు సైతం ఆ పుణ్యాంగనలను పవిత్రమైన దేవతలుగా పూజించే వారు.

# ఇందలి సవర్ణదీర్ఘ సంధి పదం గుర్తించండి.

a)

పుణ్యాంగన

b)

సాగిస్తున్నారు

c)

పవిత్రమైన

d)

సంస్కారవంతులు

9.

ఊరిలో వచ్చిన జబ్బుకు చాలా మంది బలి అవుతున్నారని గ్రామపెద్దలు సమావేశమయ్యారు. గ్రామ దేవత అయిన ఆ జగజ్జననికి జాతర జరిపి శాంతి చేయాలని నిర్ణయించారు.

# ఈ వాక్యాలలోని శ్చుత్వ సంధి పదాన్ని గుర్తించండి.

a)

జగజ్జనని

b)

సమావేశమయ్యారు

c)

బలి అవుతున్నారని

d)

ఊరిలో

10.

విద్యార్థులు ఆనందంగా మైదానంలో ఆటలు ఆడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల ముఖంలో ఆనందాన్ని చూసి మురిసిపోతున్నారు. పల్లెటూరు నుండి వచ్చిన రామయ్య పిల్లల కోసం ఆశ్రమానికి చింతాకు తెచ్చి ఇచ్చాడు.

# ఈ వాక్యాలలోని టుగాగమ సంధి పదాన్ని గుర్తించి రాయండి.

a)

పల్లెటూరు

b)

చింతాకు

c)

ఆటలాడుతున్నారు

d)

రామయ్య

e)

మురిసిపోతున్నారు

11.

మంచి మంచి ఫోటోలు తీయాలని ఉత్సాహ పడుతూ మామయ్యతో నట్టడవికి వెళ్ళాడు మణికంఠ. అక్కడ జింకలు, కుందేళ్ళు, కోతులు మొదలైన వాటిని అందంగా ఫోటోలు తీసి క్షేమంగా తిరిగి వచ్చాడు.

# ఈ వాక్యాలలోని ద్విరుక్తటకార సంధి పదాన్ని గుర్తించి రాయండి.

a)

నట్టడవి

b)

ఉత్సాహపడు

c)

మామయ్య

d)

మొదలైన

12.

అమ్మ ఒడిలో పసి పిల్లలు నిశ్చింతగా నిద్రిస్తున్నారు. చుట్టూ ప్రకృతి కూడా చల్లని గాలితో సహకరిస్తుంటే, అమ్మ చీరతో కట్టిన తూగుటుయ్యేలలో సేద తీరుతున్నారు పిల్లలు.

# ఈ వాక్యాలలో ని టుగాగమ సంధి పదాన్ని గుర్తించండి.

a)

తూగుటుయ్యేల

b)

నిశ్చింతగా

c)

నిద్రిస్తున్నారు

d)

సహకరిస్తుంటే

13.

సమాజంలో అనాధలను ఆదుకోవడం అందరి కర్తవ్యం. ప్రతి ఒక్కరు తమ వంతుగా సహాయం చేస్తే అదే దేశానికి మహోపకారం అవుతుంది.

# ఈ వాక్యాలలో గుణ సంధి పదాన్ని గుర్తించండి

a)

మహోపకారం

b)

దేశానికి

c)

ప్రతి ఒక్కరూ

d)

ఆదుకోవడం

14.

నేడు అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి. పరీక్షలు వాయిదా పడ్డాయని నిరాశ చెంది పుస్తకాలు పక్కన పడేయకుండా కృషి చేయాలి. అప్పుడు ఉత్తమ ఫలితాన్ని సాధించగలము. అటువంటి ఆనందాన్నిచ్చిన క్షణాలు మనం మరవలేము.

# ఈ వాక్యాలలో ని లు,ల,న,ల సంధి పదాన్ని గుర్తించి రాయండి.

a)

పుస్తకాలు

b)

ఆనందాన్నిచ్చిన

c)

సద్వినియోగం

d)

పరీక్షలు

15.

నేటి సామాజిక పరిస్థితి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నది. కానీ ప్రతి ఒక్కరూ తమ వంతుగా సామాజిక, వ్యక్తిగత శ్రద్ధ చూపి పరిస్థితులను ఎదుర్కొని నిలవాలి.

# ఈ వాక్యాలలోని విసర్గసంధి పదాన్ని గుర్తించండి.

a)

మనశ్శాంతి

b)

పరిస్థితి

c)

భయాందోళనలకు

d)

ఎదుర్కొని